telugu navyamedia
సినిమా వార్తలు

“మహర్షి” ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే…?

maharshi

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా, సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం “మహర్షి”. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగి సినిమాపై అందరిలో భారీ అంచనాలను పెంచేసింది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హైదరాబాద్ లో మే 1న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారని సమాచారం. వేదిక ఎక్కడ అనే విషయం తెలియాల్సి ఉంది. మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా కావడం వలన ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సినిమాకి ముందు మహేశ్ బాబు చేసిన 24 సినిమాలకి సంబంధించిన దర్శకులు మహేష్ గురించి తమ మనసులో మాటను చెప్పే వీడియోను ఈ వేదికపై ప్లే చేయనున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎవరు వస్తారనే విషయం తెలియాల్సి వుంది.

ఇక “మహర్షి” సినిమా షూటింగు పార్టు పూర్తి కాగానే, ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ వెళ్లాడు మహేష్. అంతా కలిసి అక్కడ సరదాగా షికారు చేస్తున్నారు. ఆ సమయంలో దిగిన ఒక ఫొటోను మహేశ్ బాబు శ్రీమతి నమ్రత సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. “ప్యారిస్ లో ఒక సాయంత్రం అద్భుతంగా గడిచింది” అంటూ మహేశ్ బాబు తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలియజేశాడు.

Related posts