telugu navyamedia
సినిమా వార్తలు

200 కోట్ల దిశగా పరుగులు తీస్తున్న “మహర్షి”

another single from maharshi movie

సూపర్‌స్టార్‌ మహేష్‌, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన చిత్రం “మహర్షి”. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలై యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని సొంతం చేసుకుంది. సూపర్‌స్టార్‌ మహేష్‌ ట్రెమండస్‌ పెర్‌ఫార్మెన్స్‌, వంశీ పైడిపల్లి ఎక్స్‌లెంట్‌ టేకింగ్‌, దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, వైజయంతి మూవీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా భారీ నిర్మాణ విలువలు చిత్రాన్ని ఎపిక్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. సినిమా రిలీజ్‌ అయిన అన్ని ఏరియాల్లోనూ సూపర్‌స్టార్‌ మహేష్‌ గత కలెక్షన్‌ రికార్డులను క్రాస్‌ చేసి 175 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. 19 రోజుల్లోనే 175 కోట్లు క్రాస్ చేసి 200 కోట్లకు పరుగులు తీస్తోంది. ఈ విషయాన్ని ఎస్‌విసి సంస్థ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఆనందం వ్యక్తం చేసింది.

Related posts