telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహర్షి అదుర్స్ .. ప్రీమియర్ షో టాక్..

Maharshi

సూపర్ స్టార్ మహేష్ 25వ చిత్రంగా, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఆల్రెడీ యూఎస్ లో ప్రీమియర్స్ వేయడం జరిగింది. అక్కడ నుండి వచ్చిన ఫస్ట్ రిపోర్ట్స్ చూస్తే మహర్షి అంచనాలను అందుకున్నదనే చెప్పొచ్చు. చూచాయగా కథని ట్రైలర్ లో చెప్పేసిన వంశీ పైడిపల్లి సినిమాను అద్భుతంగా మలచాడట.

కంపెనీ సిఈఓగా ఉన్న రిషి తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు.. అక్కడ తన స్నేహితుడు రవి, పూజాలతో కొన్ని కామెడీ సీన్స్.. ఆ తర్వాత సినిమా ఎమోషనల్ గా తీసుకెళ్తాడట. కెరియర్ మీద గట్టి నమ్మకం ఉన్న రిషి లైఫ్ లో సక్సెస్ అనేది ఓ డెస్టినీ కాదు జర్నీలో భాగమే అని చెబుతుంటాడు. అయితే కంపెనీ సిఈఓ గా ఉన్న రిషి గోదావరిలో ఓ ఊరికి వచ్చి అక్కడ వ్యవసాయం చేస్తాడు. రిషి అలా ఎందుకు వచ్చాడు.. దాని వెనుక కారణాలు ఏంటి అన్నది సినిమా కథ. సినిమా ఓవరాల్ గా మంచి మెసేజ్ తో కూడా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చింది. సినిమాలో మహేష్ 3 వేరియేషన్స్ లో అద్భుతంగా నటించాడని అంటున్నారు. సినిమా అక్కడక్కడ స్లో అయినా ఓవరాల్ గా ఈ సమ్మర్ కు సూపర్ స్టార్ మహేష్ మహర్షి మంచి సినిమాగా మిగులుతుందని చెప్పొచ్చు.

సినిమాలో పూజా హెగ్దె, అల్లరి నరేష్ పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవి మ్యూజిక్ ఇంప్రెస్ చేయగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ప్రాధాన్యత కనబరిచింది. ముగ్గురు బడా నిర్మాల ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్ పై ఆ రిచ్ నెస్ తెలుస్తుంది. మహర్షి సినిమా మహేష్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చే సినిమా అని ఫిక్స్ అవ్వొచ్చు. మరి అసలు టాక్ ఏంటన్నది మనదగ్గర షో పడితే కాని తెలుస్తుంది.

Related posts