telugu navyamedia
సినిమా వార్తలు

“మహర్షి” సెలెబ్రేషన్స్… స్పెషల్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ

MAharshi

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “మహర్షి” చిత్రం గురువారం నాడు విడుదలై హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. దీంతో చిత్రబృందం సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అతిథిగా విచ్చేసిన విజయ్ దేవరకొండని మరోసారి “మహర్షి” సెలబ్రేషన్స్ లో పాలుపంచుకున్నాడు. సినిమాకి హిట్ టాక్ రావడం, చాలా చోట్ల రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తున్న నేపధ్యంలో మహేష్ బాబు నిన్న రాత్రి తన ఇంట్లో పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటేవరకు ఈ పార్టీ కొనసాగింది. ముగ్గురు చిత్ర నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్, సినిమా యూనిట్, విజయ్ దేవరకొండ ఈ పార్టీకి హాజరయ్యారు. విజయ్ తో పాటు రష్మిక కూడా పాల్గొంది. మహేష్ తదుపరి సినిమా డైరెక్టర్ అనీల్ రావిపూడి కూడా రావడం విశేషం. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలని మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.

Related posts