telugu navyamedia
news political trending

మహారాష్ట్ర : … శివసేననూ .. ఆహ్వానించిన గవర్నర్…

sivasena fire on bjp's words

రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా శివసేన పార్టీని ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమ బలాన్ని, సుముఖతను తెలపాల్సిందిగా శివసేనను కోరారు. రేపు రాత్రి 7.30 గంటల లోపు తమ నిర్ణయం తెలపాల్సిందిగా పేర్కొన్నారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ఫడ్నవిస్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని తెలిపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేనను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్-44 స్థానాల్లో గెలుపొందాయి.

Related posts

ఏపీలో .. జరిమానాల మోత సవరణలు ..

vimala p

ఆర్టీసీని ప్రభుత్వమే కాపాడాలి: కిషన్ రెడ్డి

vimala p

“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” రిలీజ్ కు హైకోర్టు బ్రేక్

vimala p