telugu navyamedia
రాజకీయ వార్తలు

కేంద్రం ప్రకటన రాకముందే.. రెండు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడగింపు!

Red zone corona

కరోనా కట్టడి కోసం కేంద్రం ప్రకటించిన మూడో విడత లాక్ డౌన్ నేటితో ముగియనుంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా కేంద్రం కూడా నాలుగో విడత లాక్ డౌన్ ను ఈ నెల 31 వరకు పొడిగిస్తుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, కేంద్రం ప్రకటన రాకముందే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాయి. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, తాజాగా మహారాష్ట్ర, తమిళనాడు కూడా అదే బాటలో నడిచాయి. ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించాయి.

భారత్ లో కరోనా ప్రభావం అత్యధికంగా చవిచూస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ 30,706 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,135 మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ ను మరింత పొడిగించాలంటూ సీఎం ఉద్ధవ్ థాకరే ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. ఇక తమిళనాడు కూడా లాక్ డౌన్ ను మే 31 వరకు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసింది.

Related posts