telugu navyamedia
రాజకీయ వార్తలు

మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో పదవులపై కాంగ్రెస్ అసంతృప్తి?

uddhav-thackeray-shivasena

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. థాకరేల కుటుంబం నుంచి తొలిసారి ఉద్ధవ్ థాకరే సీఎం పదవి చేపట్టారు. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే అసంతృప్తి ప్రారంభమైందని అంటున్నారు. తమకు ఇవ్వనున్న పదవుల పట్ల కాంగ్రెస్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, సహకార, వ్యవసాయ శాఖలను కాంగ్రెస్ ఆశించింది. కానీ, ఆ పార్టీకి ప్రాధాన్యత లేని, ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండని శాఖలను ఇవ్వాలని ఉద్ధవ్ నిర్ణయించారట. దీంతో, కాంగ్రెస్ తీవ్ర నిరాశకు గురవుతోంది. వాస్తవానికి స్పీకర్ పదవిని కాంగ్రెస్ కు ఇచ్చి, హోం మంత్రి పదవిని శివసేన తీసుకోవాలని భావించారు. కానీ, హోం మంత్రి పదవిని ఎన్సీపీకి ఇచ్చేందుకు తాజాగా శివసేన సిద్ధం కావడంతో ఆ పార్టీకి తగిన ప్రాధాన్యత లభిస్తోంది. 

Related posts