telugu navyamedia
రాజకీయ వార్తలు

మహారాష్ట్రలో అమల్లోకి రానున్న రాష్ట్రపతి పాలన!

shivasena bjp

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి రాలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ, శివసేన, ఎన్సీపీలను గవర్నర్ ఆహ్వానించినప్పటికీ… ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.

ఎన్సీపీకి ఈ రాత్రి 8.30 వరకు గడువు ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. దీంతో రాష్ట్రపతి పాలన కోసం కేంద్ర హోంశాఖకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫారసు చేశారు. కాసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. మొత్తానికి ఈ రోజు సాయంత్రం వరకు మహారాష్ర్టలో కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం ఉంది. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది.

Related posts