telugu navyamedia
రాజకీయ వార్తలు

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల

against bjp trying to apply last weapon as mp resigns

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌ 21న జరుగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే 125 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ నాగపూర్‌ సౌత్‌ నుంచి పోటీ చేయనుండగా, మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌ కొత్‌రుడ్‌ నుంచి బరిలో ఉంటారని తొలి జాబితాలో ప్రకటించారు.తొలి జాబితాలో 91 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు చోటు దక్కగా, 12 మంది సిట్టింగ్‌లకు మొండిచేయి చూపారు.

తొలి జాబితాలో కాంగ్రెస్‌ నుంచి పార్టీలో చేరిన ఐదుగురు నేతలు, ఎన్సీపీని వీడిన నలుగరు, ఇద్దరు ఇండిపెండెంట్లకు సీట్లు కేటాయించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేనతో పొత్తు ఖరారైందని బీజేపీ వెల్లడించిన మరుసటి రోజే కాషాయ పార్టీ తన తొలి జాబితాను విడుదల చేయడం గమనార్హం.

Related posts