telugu navyamedia
సినిమా వార్తలు

“మహానాయకుడు” లేటెస్ట్ కలెక్షన్స్

Mahanayakudu

వెండితెర ఇలవేల్పుగా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న గొప్ప సినీ, రాజకీయ నాయకుడు దివంగత నందమూరి తారకరామారావు. ఆ మహనీయుడి జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కింది. తొలిభాగమైన “ఎన్టీఆర్ కథానాయకుడు” జనవరి 9న భారీ హైప్ తో విడుదలై “కథానాయకుడు” చిత్రబృందాన్ని, ప్రేక్షకులను నిరాశపరిచింది. తాజాగా విడుదలైన రెండవ భాగమైన “ఎన్టీఆర్ మహానాయకుడు” కూడా పేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. మొదటివారంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.3.40 కోట్ల షేర్లు వసూలు చేసింది. వీకెండ్ లో కూడా ఈ సినిమా సత్తా చాటలేకపోవడం గమనార్హం. ప్రపంచవాప్తంగా ఈ సినిమా మొత్తం రూ.3.41 కోట్లు వసూలు చేసింది.

ఏరియాల వారీగా కలెక్షన్లు :
నైజాం – రూ.0.64 కోట్లు
సీడెడ్ – రూ.0.28 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.0.28 కోట్లు
గుంటూరు – రూ.0.62 కోట్లు
ఈస్ట్ – రూ.0.17 కోట్లు
వెస్ట్ – రూ.0.18 కోట్లు
కృష్ణ – రూ.0.29 కోట్లు
నెల్లూరు – రూ.0.10 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.2.56 కోట్లు
ఓవర్సీస్ – రూ.0.60 కోట్లు

Related posts