telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘గ్యాంగ్ లీడర్’ లో .. మేఘా ఆకాశ్ ..

magha aakasha join with gang leader team

నాని కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ రూపొందుతోంది. ఆల్రెడీ ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో మొదలుకానున్న ఈ షెడ్యూల్లో మేఘా ఆకాశ్ జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఆమె నటిస్తోంది.

మేఘా, నితిన్ తో చేసిన రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో వెనుకబడిపోయి, నాని సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే తన కెరియర్ ఊపందుకుంటుందని ఆశపడుతోంది. ఈ సినిమాతో ఈ అమ్మాయి ఆశ నెరవేరుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో మరో కథానాయికగా ప్రియాంక అరుళ్ నటిస్తోంది. తెలుగులో ఈ అమ్మాయి తొలి సినిమా ఇదే. ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా కనిపించనుండటం విశేషం.

Related posts