telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పెళ్ళికి … టాయిలెట్ కి లంకె.. ఇదేమి గోల..

madyapradesh marriage rule for

దేశంలో చాలా మంది అబ్బాయిలు పెళ్లిళ్లు జరగక్కపోవడంతో ఒంటరిగా మిగిలిపోతున్నారు. కొన్నికొన్ని చోట్ల ఈ పరిస్థితి కాస్త వింతగా కూడా ఉంది. మధ్యప్రదేశ్ లో యువకులకు పెళ్లిళ్లు కావాలంటే చాలా కష్టంగా ఉన్నది. పైగా అక్కడి యువతులు అత్తారింట్లో తప్పకుండా టాయిలెట్ ఉండాలని, టాయిలెట్ లేకుంటే మాత్రం పెళ్లి చేసుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా పెళ్లిళ్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది. అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకోవాలి అంటే.. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసి ప్రభుత్వానికి పంపించాలి. అలా ఫోటో షూట్ చేసే సమయంలో తప్పకుండా టాయిలెట్ దగ్గర నిలబడి ఫోటో దిగాలి. ఆ ఫోటోను కూడా జతచేసి కన్యా వివాహ పధకానికి పంపించాలి. అలా ఫోటోను జతచేసి పంపితేనే.. ఆ పథకం కింద ప్రభుత్వం రూ. 51వేలరూపాయలను అందిస్తుంది.

రాష్ట్రంలో టాయిలెట్ విధానాన్ని ప్రోత్సహించేందుకు అక్కడి ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఫోటో షూట్ వరకు బాగానే ఉందిగానీ, మరీ టాయిలెట్ దగ్గర ఫోటో దిగి ఆ ఫోటోను జత చేసి పంపాలంటే కొంత ఇబ్బందిగా ఉందని ప్రజలు వాపోతున్నారు. టాయిలెట్ ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, అలా శుభ్రంగా ఉంచుకుంటేనే రోగాల బారిన పడకుండా ఉంటారని, ఫోటో దిగుతున్నారు కాబట్టి టాయిలెట్ ను క్లీన్ గా ఉంచుకుంటారని ఈ ఉద్దేశ్యంతోనే టాయిలెట్ ఫోటో షూట్ ను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెప్పుకొస్తుంది.

Related posts