telugu navyamedia
సినిమా వార్తలు

నన్ను వేధించినందుకే అలా..!

తమిళ స్టార్ హీరో విశాల్ విశాల్ కు మద్రాస్ హైకోర్టు నుండి ఊరట లభించింది. గత కొద్ది కాలంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకునే ఉన్నారు. వ్యక్తిగత విషయాల నుంచి సినిమా విషయాల వరకు ప్రతిదానిలో నిత్యం వార్తలలో నిలుస్తుంటారు. కొత్త‌గా విశాల్ హీరోగా నటించిన చక్ర సినిమాపై.. నిర్మాతలపై.. హీరోపై లైకా ప్రొడక్షన్ సంస్థ కాపీ రైట్స్ ఆరోపణలు చేస్తూ కేసు కొంతకాలంగా కోర్టులో నానుతోంది.

‘చక్ర’ సినిమాను దర్శకుడు తొలుత కథను తమకు చెప్పాడని, అది నచ్చి తాము సినిమా నిర్మించడానికి సిద్ధపడిన తర్వాత దాన్ని విశాల్ సొంతంగా తీశాడంటూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టుకు ఎక్కింది. అయితే… కోర్టు దీనిని కొట్టేసింది. అంతేకాదు… విశాల్ పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు రూ. 5 లక్షల జరిమానాను లైకా కు విధించింది.

Madras High Court shocker to Vishal

ఈ విషయాన్ని విశాల్ తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా తెలిపాడు. న్యాయస్థానాల మీద తనకు ఉన్న నమ్మకం నిజమైందని, సత్యం ఎప్పటికైనా బయటకు వస్తుందనేది మరోసారి రుజువైందని విశాల్ పేర్కొన్నాడు. తన మీద, ‘చక్ర’ మూవీ మీద పెట్టిన కేసును కోర్టు డిస్మిస్ చేయడంతో ఆ సంస్థకు ఐదు లక్షల పెనాల్టీ వేయడంపై విశాల్ హర్షం వ్యక్తం చేశాడు. ఇదంతా లైకా ప్రొడక్షన్స్ నన్ను మానసికంగా వేధించినందుకేనని అని అనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు.

కాగా విశాల్ ఇటీవల షూటింగ్ సమయంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశాల్.. శరవణన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షుటింగ్ చివరిదశలో ఉంది.

Related posts