telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

60 ఏళ్ళ వయసులో… అందాలతో వెర్రెత్తిస్తున్న మడోన్నా

Madonna

పాప్ క్వీన్ మడోన్నా సంగీత ప్రపంచంలో ఓ సంచలనం. ఊపైన పాటలతో.. కుర్రకారును హీటెక్కించే తన స్టెప్పులతో అద్భుతమైన ప్రదర్శనలిస్తూ ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. అలా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. మడోన్న సింగరే కాదు గొప్ప అందగత్తె కూడా. అరవై ఏళ్ల వయస్సులో కూడా తన అందచందాలతో ఇంకా ఎంతో హాట్‌గా మరెంతో సెక్సీగా మెయింటేన్ చేస్తుందంటే మడోన్నా అందం ఎలాంటిదో అట్టే అర్థమైపోతుంది. మరే మహిళా ఆర్టిస్ట్‌కు లేనన్ని నెంబర్ వన్ ఆల్బమ్‌లు మడోన్న సొంతం. తాజాగా మడోన్నా తన తాజా సింగిల్ మ్యూజిక్ వీడియో “మెడెల్లిన్”ను లాటిన్ సంగీతంలో స్టార్ మాలమాతో కలసి విడుదల చేసింది. ఇందులో ఆమె స్టెప్పులు చూస్తే వెర్రెత్తి పోతుంది. ఇది తన నూతన ఆల్బమ్ మేడం చీ లోని తొలిపాట. ఈ ఆల్బమ్ మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 14న వదలనుంది.

Related posts