telugu navyamedia
political

పూణె లోక్ సభ స్థానం నుంచి మాధురీ దీక్షిత్ పోటీ!

Maduri Dishit Give Clarity Election Contest
ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్  ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. 2019లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పూణె లోక్ సభ స్థానం నుంచి మాధురీ దీక్షిత్ ను బరిలోకి దించేందుకు బీజేపీ సిద్దమైంది. ఈ ఏడాది జూన్‌లో సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మాధురీ దీక్షిత్‌ను ఆమె నివాసంలో కలిసిన విషయం తెలిసిందే. 
ఈ సందర్భంగా బీజేపీ చేపట్టిన కార్యక్రమాలు, మోదీ ప్రభుత్వ అభివృద్ధిని వివరించారు. మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఒకరు జాతీయ వార్తా ఏజెన్సీతో మాట్లాడుతూ.. పూణే లోక్‌సభ స్థానానికి చేసిన షార్ట్‌లిస్ట్‌లో మాధురీ దీక్షిత్ పేరు ఉన్నట్లు తెలిపారు. మాధురీ దీక్షిత్‌కు  పూణె నియోజకవర్గం అన్నివిధాల అనుకూలంగా ఉంటుందని తెలిపారు.

Related posts

ఏపీని భయపెడుతున్నపెథాయ్‌ ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరిక

ashok

తెలంగాణ  ఎన్నికల ప్రభావం ,ఎపి రాజకీయం ఎలా మారబోతుంది?

ashok

రాజస్థాన్ లో .. ప్రశాంతంగా పోలింగ్…

vimala p