telugu navyamedia
సినిమా వార్తలు

ఘాటైన లిప్ లాక్… హీట్ పెంచుతున్న శోభిత ధూళిపాళ్ల

Made-in-Heaven

ఫ్యాషన్ రంగం నుంచి గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది తెనాలి బ్యూటీ, తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. గత సంవత్సరం టాలీవుడ్ లో అడవిశేషు సరసన నటించిన “గూఢచారి” సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో శోభిత నటనకు, గ్లామర్ పరంగా కూడా మంచి మార్కులను సంపాదించుకుంది. ఆ తరువాత తెలుగులో ఏ సినిమాకూ సైన్ చేయలేదు. బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ నిర్మిస్తున్న “మేడ్ ఇన్ హెవెన్” అనే వెబ్ సీరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సీరీస్ లో శోభిత వెడ్డింగ్ ప్లానర్ గా కనిపిస్తోంది. ఈ సీరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను అమెజాన్ ప్రైమ్ తాజాగా విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో మరో వెడ్డింగ్ ప్లానర్ అర్జున్ మాధుర్ తో కలిసి శోభిత చేసిన ఘాటైన లిప్ కిస్ లు మాత్రం యూత్ లో హీట్ పెంచుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ వచ్చే నెల నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవనుంది.

Related posts