telugu navyamedia
సినిమా వార్తలు

మెగా డాటర్ నిహారిక “మ్యాడ్ అనౌన్స్‌మెంట్”

Niharika

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య నిహారిక ఒక మ‌న‌సు, హ్యాపీ వెడ్డింగ్‌, సూర్య‌కాంతం వంటి చిత్రాల‌తో వెండితెరపై ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయాయి. నిహారిక “సైరా” చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 2న చిత్రం విడుద‌ల కానుంది. కాగా తొలిసారి “ముద్ద‌పప్పు ఆవ‌కాయ” అనే వెబ్ సిరీస్‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భించగా, త‌న తండ్రితో క‌లిసి పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బేన‌ర్‌పై “నాన్న కూచి” అనే వెబ్ సిరీస్ చేసింది. ఇక తాజాగా మ‌రో వెబ్ సిరీస్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. “మ్యాడ్ హౌజ్” పేరుతో రూపొంద‌నున్న ఈ వెబ్ సిరీస్ మంచి కంటెంట్‌తో రూపొందుతుంది. ఇది మీ అంద‌రికి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంద‌ని నిహారిక చెప్పుకొచ్చింది. “అమృతం” సీరియ‌ల్‌లా ఇది కూడా ఫుల్ కామెడీగా ఉంటుందట‌. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో రకంగా కథ‌ ఉండబోతుందని, 100 ఎపిసోడ్ ల వరకు ఈ వెబ్ సిరీస్ ప్ర‌సారం కానుంద‌ని నిహారిక చెప్పుకొచ్చింది.

Related posts