telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఒత్తిడి తగ్గించే .. మాచా టీ .. తాగి తీరాల్సిందే..సైంటిస్టులు ..

macha tea to overcome stress

నేటి హడావుడి జీవితంలో ఒత్తిడి లేకుండా బ్రతకడం చాలా కష్టమే! కానీ ఆ ఒత్తిడిని దూరం చేసుకోడానికి మాత్రం బోలెడన్నీ మార్గాలున్నాయి. వాటిలో ఒకటి ‘మాచా టీ’. అవును నిజమే.. జపనీయులు తాగే మాచా టీ తాగితే ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్ అనే కథనంలో సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచా పౌడర్ లేదా మాచా ఎక్స్‌ట్రాక్ట్‌లను వాడి ఎలుకలపై చేసిన ప్రయోగాలు సఫలమయ్యాయి. ఈ క్రమంలో ఆందోళనగా, కంగారుగా కనిపించిన ఎలుకలు మాచా టీ పౌడర్‌తో ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాయని సైంటిస్టులు గుర్తించారు.

పరిశోధకులు చెబుతున్న ప్రకారం.. మాచా టీని తాగడం వల్ల ఆ పొడిలో ఉండే ఔషధ కారకాలు మన శరీరంలో డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లను యాక్టివేట్ చేస్తాయట. దీంతో మనస్సు రిలాక్స్ అవుతుంది. ప్రశాంతంగా మారుతారు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఇతర అన్ని మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక ఈ సమస్యల నుంచి బయట పడాలంటే నిత్యం మాచా టీని తీసుకోవాల్సిందని సైంటిస్టులు సూచిస్తున్నారు.

Related posts