telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బెడ్ రూంలో ఆడిషన్… అది కూడా రేప్ సీన్ అంట… : హీరోయిన్

Maanvi

మీటూ పేరుతో ఇప్పటికే నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి మాన్వి గగ్రూకు కెరీర్‌ తొలినాళ్లలో ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందట. ఈ విషయాన్ని ఆమె మీడియా ద్వారా వెల్లడించారు. సినిమాల్లో ప్రయత్నించాలని అనుకున్న మాన్వి ఓసారి ఆడిషన్స్ కోసం ముంబయి వెళ్లారట. ఆ సమయంలో క్యాస్టింగ్ డైరెక్టర్ ఒకరు మాన్విని ఆఫీస్‌లోనే రేప్ సీన్‌లో నటించి చూపించాలని డిమాండ్ చేశాడట. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ “నాకు ఇప్పటికీ గుర్తు. ఓసారి ఆడిషన్‌కి వెళ్తే రేప్ సీన్‌లో నటించాలని చెప్పారు. ఆ రూంలో కేవలం ఇద్దరు మగాళ్లు ఉన్నారు. వారి ముందు నన్ను రేప్ సీన్‌లో నటించమన్నారు. ఆ గదే వారి ఆఫీసట. అందులో ఓ బెడ్ కూడా ఉంది. భయంతో బయటికి పరుగులు తీశాను. మళ్లీ వారు పిలిచినా కూడా వెళ్లలేదు. వారు చెప్పినట్లు నేను రేప్ సీన్‌లో నటించి ఉంటే నా పరిస్థితేంటో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఆడిషన్ పేరిట వారు నన్ను ఏదైనా చేసి ఉండొచ్చు. అని వెల్లడించారు. ‘2019 నాకు ఎన్నో మంచి అనుభవాలను ఇచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమాల్లో నటించడం వల్ల నేను ఎన్నో విదేశాలకు వెళ్లగలుగుతున్నాను. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే నా సొంత డబ్బులతో ఇన్ని ప్రాంతాలకు తిరిగేదాన్ని కాదు’ అని వెల్లడించింది మాన్వి. కానీ లక్కీగా మాన్వి ట్యాలెంట్‌ను గుర్తించి ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆమె ‘ట్రిప్లింగ్ 3’, ‘ఫోర్ మోర్ షాట్స్’, ‘ఉజ్బా చమన్’ సినిమాల్లో నటించారు. ఈ మూడిట్లో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

Related posts