telugu navyamedia
సినిమా వార్తలు

“మా” లో విందు రాజకీయాలు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎన్నో సంస్థలకు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి అయితే చాలా వాటి గురించి మీడియా పట్టించుకోడు. జనం కూడా వాటికి ప్రాధాన్యత ఇవ్వరు. మరి మూవీ ఆర్టిస్ట్స్అ సోసియేషన్ ఎన్నికలకు ఎందుకింత ఆర్భాటం ?ఎవరికోసం ఈ ప్రచారం ? “మా “లో వున్న సభ్యులంతా నటీనటులే. అందుకే గ్లామర్ ప్రపంచం కాబట్టే ఈ ప్రచారం. ఈ సారి ‘మా ‘ ఎన్నికల్లో రెండు గ్రూపులు పోటీపడుతున్నాయి. ఒకటి చిరంజీవి పరోక్షంగా మద్దతు ఇస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ కాగా మరోటి మోహన్ బాబు మద్దతు ఇస్తున్న విష్ణు ప్యానల్. వచ్చేనెల 10వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం చైర్మన్ కృష్ణంరాజు ఇప్పటికే ప్రకటించారు. అంటే మరో నెల రోజుల్లో “మా ” ఎన్నికలు జరగబోతున్నాయి.

అయితే ఇప్పటికే ఈ రెండు ప్యానల్ నాయకులు, నటీనటులను ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో “విందు ” రాజకీయం ముఖ్యమైనది . ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఒక స్టార్ హోటల్ లో మందు ,విందు తో గ్రాండ్ పార్టీ ఇచ్చాడట. ఇది తెలుసుకున్న మోహన్ బాబు కూడా అంతకంటే పెద్ద పార్టీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడట . ఇప్పటికే గ్రూప్ రాజకీయాలు జోరందుకున్నాయి. దానికి తోడు ఈ విందు పార్టీలు మరింత జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. “మా ” చాలా చిన్న సంస్థ. అయినా దీనికి గ్లామర్ వుంది కాబట్టి ఎన్నికల్లో తమ ప్యానల్న్ గెలిపించుకొని పట్టు సాధించాలనే లక్ష్యంతో నాయకులు పనిచేస్తున్నారు .

ఒకప్పుడు “మా” అంటే అందరికీ గౌరవము వుంది. దాని కార్యక్రమాలు కూడా హుందాగా ఉండేవి. కానీ ఇప్పుడు “మా ” బజారున పడిపోయిందని, ఒకరు మీద మరొకరు బురద చల్లుకొని కార్యక్రమాలే కార్యక్రమాలే ఎజండాగా ముందుకు సాగడం చాలా దురదృష్టకరమని గతంలో “మా ” అధ్యక్షుడు వ్యాఖ్యానించాడు. “మా “లో వున్న సభ్యుల సంక్షేమం గురించి కాక తమ అధికారానికే ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు పోటీ చేస్తున్న సభ్యులు తాపత్రయ పడుతున్నారు . ఇది నిజంగా అనారోగ్య పరిణామం .

Related posts