telugu navyamedia
సినిమా వార్తలు

6న నరేష్ ‘కళ్యాణం “! ?

MAA New President Naresh Oath On 6th April
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్  అధ్యక్షుడు నరేష్ మీద చాలా మంది అసంతృప్తితో వున్నారని , అతను మా ప్రెసిడెంట్ కాగానే అహంకారం వచ్చిందని , దాన్ని పోగొట్టాలని సభ్యులు నిశ్చయించు కున్నట్టు తెలిసింది . 
మా అధ్యక్షుడు గా నరేష్ ఎన్నికయ్యాడు . గత నెల 22 న పదవి ప్రమాణ స్వీకారం చేశాడు . ఈ వేదిక మీద అనేక పెద్దవారు ఉండగా నరేష్ అంతా తానె చేసినట్టు బిల్డప్ ఇచ్చేశాడు . ఇది చాలా మందికి నచ్చలేదు . కార్యదర్శి జీవిత ,రాజశేఖర్ వేదిక మీదనే చివాట్లు పెట్టారు . 
ఎందుకంటే కష్టం అంతా వారిదైతే , పేరు మాత్రంతాను   కొట్టేద్దామని ప్రయత్నం చేశాడు . కానీ అది ఊహించని విధంగా రివర్స్ అయ్యింది నిజానికి శివాజీ రాజా ప్యానల్ ను వ్యతిరేకంగా జీవిత ,రాజశేఖర్ చాలా కష్టపడ్డారు . కృష్ణ నగర్ కూడా వెళ్లి చిన్న ఆర్టిస్టులను  ప్రసన్నం చేసుకున్నారని , ఇక పెద్ద వారికోసం ఓ స్టార్ హోటల్లో పార్టీ కూడా వారే ఇచ్చారట . ఇక నరేష్ మాత్రం పెద్ద కష్టపడలేదని , స్టేజి మీద మాత్రం అంతా తానె చేశానని  చెప్పడం పలువురికి కోపం తెప్పించిందని అంటున్నారు . 
ఇప్పుడే ఇట్లా ఉంటే తరువాత ఇతని ప్రవర్తన ఎలా ఉంటుందో అంచనా వేస్తున్నారు . అందుకే ఈ నెల 6వ తేదీన జరిగే కార్యవర్గ సమావేశంలో నరేష్ ప్రవర్తన పై చర్చ జరిగే అవకాశం వుంది . ఆరోజు ఏమి జరుగుతుందో ? నరేష్ పై మిగతా సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి . 

Related posts