telugu navyamedia
సినిమా వార్తలు

‘మా’ ఎన్నికల ముహుర్తం ఖ‌రారు

తెలుగు రాష్ర్టాల్లో గ‌త‌ కొద్దిరోజులుగా ఉత్కంఠ రేపుతున్న ‘మా’ ఎన్నికల ముహుర్తం ఎట్ట‌కేల‌కు ఖ‌రారు అయ్యింది . గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం ప్రధాన పోటీ.. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే పోటీ నుంచి జీవితా రాజశేఖర్, హేమ తప్పుకోగా.. అనుహ్యాంగా బండ్ల గణేష్ పోటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అభ్యర్థుల మధ్య పోటీ మరింత పెరిగింది.

MAA: Prakash Raj Announces 26 Names From His Panel -

ఈ నేపథ్యంలో తాజాగా మా ఎన్నికల 2021-23కు సంబంధించిన నోటిఫికేషన్‏ను ఈరోజు విడుదల చేశారు.వచ్చే నెల 10 వ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ జూబ్లీ హిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటిస్తూ..ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్ విడుదల చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలతోపాటు, పాటించవలిసిన ఎన్నికల నియమ నిబంధనలను కూడా వి.కృష్ణమోహన్‌ వెల్లడించారు.

8 మంది ఆఫీస్ బేరర్స్.. 18 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కోసం జరిగే ఈ ఎన్నికలకు ఈనెల 27 నుంచి 29 వరకు నామినేషన్స్ స్వీకరిస్తారు.30న నామినేషన్స్ పరిశీలన జరుగుతుంది. నామినేషన్స్ ఉపసంహరణకు వచ్చే 1-2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుంది. ఇక ఎలక్షన్స్‏లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను అక్టోబర్ 2న ప్రకటిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించి సాయంత్రం 7 గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు.

MAA Elections: Vishnu Manchu gives an update on his campaign |  TeluguBulletin.com

నోటిఫికేషన్‏లో నిబంధనలు ..
* ఒక అభ్యర్ధి ఒక పదవి కోసమే పోటీ చేయాలి
* గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్ లకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుంది.
* 24 క్రాప్ట్స్ లో ఆఫీస్ బేరర్‏గా ఉన్నవారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.

Related posts