telugu navyamedia
సినిమా వార్తలు

మా చిట్టి కి నేర్పండమ్మా . . ! 

pitta rayabaram poetry corner

నింగిలో ఎగిరే చిలుకమ్మా !
మా ఇంటికి నీవు రావమ్మా ! !
తియ్యని మాటలు చెప్పమ్మా !
మా చిట్టి కి మాటలు నేర్పమ్మా ! !

తోటలో తిరిగే కోయిలమ్మా !
మా ఇంటికి నీవు రావమ్మా ! !
కమ్మని పాటలు పాడమ్మా !
మా చిట్టి కి పాటలు నేర్పమ్మా ! !

అడవిలో నడిచే నెమలమ్మా !
మా ఇంటికి నీవు రావమ్మా ! !
చక్కని నాట్యం చేయమ్మా !
మా చిట్టి కి నాట్యం నేర్పమ్మా ! ! 

కొలనులో పూచే కలువమ్మా !
మా ఇంటికి నీవు రావమ్మా ! !
వెన్నెల కథలు చెప్పమ్మా !
మా చిట్టికి కథలు నేర్పమ్మా ! !

చెరువులో ఈదే చేపమ్మా !
మా ఇంటికి నీవు రావమ్మా ! !
తొట్టిలో ఈత కొట్టమ్మా !
మా చిట్టి కి ఈత నేర్పమ్మా ! !

అందరూ రోజూ రారమ్మా !
మా ఇంటికి మీరు రారమ్మా ! !
అన్ని విద్యలు నేర్పండమ్మా !
చిట్టిని విజేతగా చేయండమ్మా ! !

– పల్లోలి శేఖర్ బాబు, కొలిమిగుండ్ల

Related posts