telugu navyamedia
సినిమా వార్తలు

సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ మృతి

Vedavyasa Rangabhattar

సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ బుధవారం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్నారు. గత వారం రోజుల నుండి స్విమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి 9 గంటల సమయంలో మరణించారు. ఆయన స్వగ్రామమైన బైరాగిపట్టెడలో ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈయనకు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

రంగభట్టర్ 1946లో జన్మించిన వరంగల్ జిల్లా కోమటిపల్లి అగ్రహారంలో జన్మించారు. 1968లో టీటీడీలో ఎస్వీ ప్రాచ్య కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా పని చేశారు. 1986లో తొలిసారి ఆయన “రంగవల్లి” చిత్రానికి పాటలు రచించారు. ఆ తరువాత ‘శ్రీమంజునాథ, రామదాసు, పాండురంగడు, షిరిడీ సాయి, అనగనగా ఒక ధీరుడు, ఝుమ్మంది నాదం, ఓం నమో వెంకటేశాయ లాంటి సినిమాలతో కలిపి దాదాపు పదమూడు చిత్రాలకు సాహిత్యం అందించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Related posts