telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉద్యోగ విరమణ!

subramanyam cs

ఏపీ మాజీ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం నేడు ఉద్యోగ విరమణ కానున్నారు. ఆయనకు వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. గురువారం పదవీ విరమణ చేయాల్సిన ఆయన, ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన పదవీ విరమణ చేసేలోగా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి శిక్షణా సంస్థ డైరెక్టర్ ‌గా బాధ్యతలు స్వీకరించి, ఆపై రిటైర్ అయ్యేలా చూడాలని ప్రభుత్వం భావించింది.

ఎల్వీ సుబ్రహ్మణ్యం 1983 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి. సీఎస్‌గా ఉన్న ఆయనను అకస్మాత్తుగా హెచ్‌ ఆర్డీ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ జీఏడీ పొలిటికల్‌ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఎల్వీ ఆ రోజు నుంచి తన ఉద్యోగానికి సుదీర్ఘ సెలవు పెట్టారు. సర్వీస్ కాలం తక్కువగా ఉన్నందునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి.ప్రభుత్వం కేటాయించిన పోస్టులో చేరకుండానే రిటైర్‌ కానున్నారు.

Related posts