telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఏంటంటే ?

Lung

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కి సంబంధించిన మరణాలు ఎక్కువగా లంగ్ క్యాన్సర్ వల్లే చోటుచేసుకుంటున్నాయి. లంగ్ క్యాన్సర్ కి సంబంధించిన ప్రారంభ లక్షణాలుగా చిన్నపాటి దగ్గు, శ్వాస అందకపోవడం వంటి లక్షణాలను పరిగణించవచ్చు. క్యాన్సర్ డెవెలప్ అవుతున్న కొద్దీ ఈ లక్షణాలు మరింత తీవ్రతరమవుతాయి. మిగతా క్యాన్సర్ ల లాగానే లంగ్ క్యాన్సర్ విషయంలో కూడా అలసట అలాగే ఆకలి లేకపోవడం వంటి లక్షణాలుంటాయి. చాలా సందర్భాల్లో లంగ్ క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలు ఎర్లీ స్టేజ్ లో కనిపించవు. ఒకవేళ లక్షణాలు కనిపంచినా అవి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. ఐతే, కామన్ గా కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గేటప్పుడు, దగ్గు తీవ్రమైనప్పుడు, నవ్వేటప్పుడు లేదా డీప్ బ్రీత్ తీసుకునేటప్పుడు, ఛాతిలో నొప్పి, బ్యాక్ అలాగే భుజాల నొప్పి, సడన్ గా శ్వాస అందకపోవడంలో సమస్యలు. రొటీన్ యాక్టివిటీస్ సమయంలో కూడా ఈ సమస్య రావడం. బలహీనంగా అలాగే అలసటగా ఉన్నట్టు అనిపించడం, ఆకలి మందగించడం, బ్రోన్కైటీస్ లేదా న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తగ్గకపోవడం, వీజింగ్ లేదా గొంతు బొంగురుపోవడం.

లంగ్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ?

1. స్మోకింగ్:
టొబాకోను స్మోక్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఇదే లీడింగ్ కాజ్ అనంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. దాదాపు 80 శాతం క్యాన్సర్ డెత్స్ అనేవి స్మోకింగ్ చేసేవారిలో కన్పిస్తున్నాయి. మిగతావి సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కు ఎక్పోజ్ కావడం వల్ల జరుగుతున్నాయని అంటున్నారు. స్మోకింగ్ చేసే వారి పక్కనుండడం కూడా ప్రమాదమే అనంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఐతే, స్మోక్ చేసే ప్రతి ఒక్కరిలో లంగ్ క్యాన్సర్ వస్తుందని చెప్పలేము. జెనెటిక్స్ కూడా మెయిన్ రోల్ పోషిస్తుందని అంటున్నారు.

2. జీన్స్:
ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉంటే కుటుంబ సభ్యులకు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. వీరికి స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా లేకపాయినా లంగ్ క్యాన్సర్ బారిన పడే రిస్క్ మాత్రం ఉంది.

3. రాడాన్ గ్యాస్:
ఇది ఎటువంటి వాసన లేని కెమికల్ గ్యాస్. దీని ఆటమిక్ నంబర్ 86. ఇది పర్యావరణంలో రిలీజ్ అవుతుంది. మనం దీన్ని పీల్చే అవకాశం ఉంది. ఇన్డోర్ ఎయిర్ పొల్యూషన్ కి కారణమవుతుంది. సైలెంట్ కిల్లర్ లా పనిచేస్తుంది. కాబట్టి, ఇంట్లో ఎయిర్ క్వాలిటీను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

4. ఏస్బెస్టోస్ (రాతినార):
మైన్స్, మిల్లులు, టెక్స్టైల్ ప్లాంట్స్, షిప్ యార్డ్స్ తో పాటు ఇన్సులేషన్ ను వాడే ప్రదేశాలలో పనిచేసేవారికి లంగ్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అనంటున్నారు నిపుణులు. కాంక్రీట్ రూఫ్ కు రాతినార అనేది చవకైన ఆల్టర్నేటివ్ గా పరిగణిస్తారు చాలామంది. ఇక్కడే ఆరోగ్య సమస్య మొదలవుతుంది.

5. విటమిన్ సప్లిమెంట్స్:
విటమిన్ సప్లిమెంట్స్ తో సమస్య తగ్గడం మాటను పక్కనుంచితే సమస్యకు గురయ్యే రిస్క్ ఎక్కువని తేలింది. బీటా కెరోటిన్ సప్లిమెంట్స్ ను తీసుకున్నవారిలో లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరిగిందట. స్మోకర్స్ లో ఈ రిస్క్ ఎక్కువట. కాబట్టి, స్మోకర్స్ బీటా కెరోటిన్ సప్లిమెంట్స్ కు దూరంగా ఉండటం మంచిది అనంటున్నారు నిపుణులు.

Related posts