telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

రాజీవ్ హత్యకేసులో జైల్లో ఉన్న నళినికి పెరోల్ మంజూరు

nalini Ltte

మాజీ ప్రధాని రాజీవ్ హత్యకేసులో జీవితఖైదును అనుభవిస్తున్న ఎల్టీటీఈకి చెందిన నళినికి ఊరట లభించింది. తన కుమార్తె వివాహాన్నిచూడాలనుకున్న ఆమె కోరిక తీరనుంది. కూతురు వివాహానికి వెళ్లేందు నళినికి మద్రాస్ హైకోర్టు 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. నళిని కుమార్తె లండన్ లో నివసిస్తున్నారు. కుమార్తె పెళ్లి పనులను చూసుకునే నిమిత్తం తనకు పెరోల్ మంజూరు చేయాలన్న నళిని విన్నపం పట్ల మానవతాదృక్పధంతో మద్రాస్ కోర్ట్ పెరోల్ ఇచ్చింది.

తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ లో బహింరంగసభలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై ఎల్టీటీఈ ఆత్మాహుతి దళం దాడి చేసింది. 1991 మే 21న జరిగిన ఈ దాడిలో రాజీవ్ శరీరం ముక్కలైంది. మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నళినితో పాటు మరో ఆరుగురు వేలూరు సెంట్రల్ జైల్లో జీవితఖైదును అనుభవిస్తున్నారు.

Related posts