telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

చనిపోయినా అతన్ని వదలడం లేదు ఈ కుక్క…!?

Dog

మనుషులపై కుక్కలకు ఎనలేని విశ్వాసం ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే… అయితే ఇప్పుడు దానికి నిదర్శనంగా మరో ఘటన చోటు చేసుకుంది. గ్రీస్‌లో హ్యారిస్ అనే వ్యక్తి 2017లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతనికి ఓ పెంపుడు కుక్క ఉంది. హ్యారిస్ మరణించాక ఆ పెంపుడు కుక్కను వేరొకరు దత్తతు తీసుకున్నప్పటికీ.. ఆ కుక్క మాత్రం హ్యారిస్ చనిపోయిన ప్రదేశానికి వెళ్లి.. అక్కడే ఉంటోంది. ఎన్నో నెలలుగా అక్కడే జీవిస్తున్న కుక్కను చూసి.. జాలిపడ్డ స్థానికులు కుక్కకు నిత్యం ఆహారం పెడుతూ వస్తున్నారు. తన యజమాని చనిపోయిన చోటే ఆ కుక్క ఉండటానికి ఓ చిన్న చోటును కల్పించారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే… అసలు హ్యారిస్ చనిపోయిన ప్రాంతం గురించి కుక్కకు ఎలా తెలిసిందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. హ్యారిస్ ఇంటికి ఏడు మైళ్ల దూరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎవరూ చెప్పకుండా, చూపించకుండానే ఆ కుక్క తనంతట తాను హ్యారిస్ చనిపోయన ప్రదేశానికి వెళ్లి ఉండడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదేమైనా మనుషులపై కుక్కలు చూపే ప్రేమ వెలకట్టలేనిది. గతంలో ఓ పెంపుడు కుక్క తన యజమాని సమాధి వద్దే 15 ఏళ్లు గడిపి అనంతరం చనిపోయింది. అప్పట్లో ఆ కుక్కకు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.

Related posts