telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లవ్ స్టోరీ మరో కొత్త పోస్టర్

అక్కినేని నాగచైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సి.హెచ్. సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అయింది. అయితే… తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరో పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్టర్‌ లో సాయి పల్లవిని నాగ చైతన్య హాగ్‌ చేసుకుని ఉంటాడు. ఈ పోస్టర్‌ రిలీజ్ కావడంతోనే సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. అంతేకాదు… ఈ మూవీ టీజర్‌ యూట్యూబ్‌లోను ట్రెండింగ్‌ అవుతోంది. ఇక ఈ సినిమా త్వరలోనే థియేటర్లో రిలీజ్ కానుంది. 

Related posts