telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ప్రియవారియర్… ‘లవర్స్ డే’ ఫస్ట్ లుక్…

lovers day movie first look

కన్నుగీటుతో కుర్రకారు మనసులను దోచుకున్న నటి ప్రియా వారియర్. ఆమె నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ అనే మలయాళ సినిమాలో హీరోను చూసి ఆమె కన్నుగీటిన తీరు .. అందరి దృష్టిని ఆ సినిమా వైపుకు తిప్పింది. తెలుగులోనూ ప్రియా వారియర్ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకోగలిగింది. వాళ్లంతా కూడా ఈ సినిమా తెలుగులోకి ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

lovers day movie first lookఒమర్ లులూ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులోను విడుదల చేస్తున్నారు. ‘లవర్స్ డే’ అనే టైటిల్ తో ఈ సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. గురురాజ్ .. వినోద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి షాన్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన సంగీతం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. తెలుగులో ఈ సినిమా సంచలనానికి తెరతీస్తుందా.. అనేది చూడాల్సి ఉంది.

Related posts