telugu navyamedia
సినిమా వార్తలు

“లవర్స్ డే”… ప్రియా వారియర్ తో అల్లు అర్జున్

allu arjun

కన్నుగీటుతో కుర్రకారు మనసులను దోచుకున్న నటి ప్రియా వారియర్. ఆమె నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ అనే మలయాళ సినిమాలో హీరోను చూసి ఆమె కన్నుగీటిన తీర… అందరి దృష్టిని ఆ సినిమా వైపుకు తిప్పింది. తెలుగులోనూ ప్రియా వారియర్ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకోగలిగింది. వాళ్లంతా కూడా ఈ సినిమా తెలుగులోకి ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఒమర్ లులూ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులోను విడుదల చేస్తున్నారు. ‘లవర్స్ డే’ అనే టైటిల్ తో ఈ సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. గురురాజ్, వినోద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి షాన్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు.

ఈ సినిమా తెలుగు ఆడియో వేడుకను హైదరాబాద్ లో ఈ నెల 23న బుధవారం సాయంత్రం 6 గంటలకు జెఆర్సీ కన్వెన్షన్లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ వేడుకకి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. ప్రియా క్రేజ్, అల్లు అర్జున్ ఈ సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావడం… సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తోంది. మరి తెలుగులో ఈ సినిమా సంచలనానికి తెరతీస్తుందా అనేది చూడాలి.

Related posts