• Home
  • వార్తలు
  • కాబోయే కానిస్టేబుల్ పై లారీ ఎక్కించిన వైనం…
క్రైమ్ వార్తలు వార్తలు

కాబోయే కానిస్టేబుల్ పై లారీ ఎక్కించిన వైనం…

road accident

బైక్‌ను లారీ ఢీకొట్టడంతో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన ధరావత్‌ బాలు (29), కవిత(26) భార్యాభర్తలు. ఎల్బీనగర్‌లో నివసిస్తూ నగర శివారులోగల ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. మంగళవారం కళాశాలకు వెళ్లారు. విధులు ముగించుకొని తిరిగి ఎల్బీనగర్‌కు వెళుతుండగా పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ సమీపంలో విజయవాడ జాతీయ రహదారిపై వారి బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఇద్దరికీ బలమైన గాయాలు కాగా అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. ఇటీవల జరిగిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షల్లో కవిత అర్హత సాధించినట్టు తెలిసింది. బాలు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Related posts

మధ్యాహ్నమే.. ముహూర్తం…ఆ తరువాత… రద్దే..

chandra sekkhar

పీకల్లోతు ప్రేమలో విజయ్… ఇరు కుటుంబాలు కలిసి డిన్నర్…

vimala t

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు…

chandra sekkhar

Leave a Comment