telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

నా ప్రియుడికి బా డ్రెస్సులు నచ్చడం లేదట…!?

London Woman posts clothes her boyfriend hates goes viral

సామాజిక మాధ్యమాల పుణ్యమా అని కొందరు తమ ప్రత్యేకతతో రాత్రికి రాత్రే స్టార్‌గాను అవతరిస్తున్నారు. ఇలాగే లండన్‌కు చెందిన 24 ఏళ్ల ఒలివియా జాక్సన్ అనే యువతి కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెరైటీ పోస్టులతో ప్రస్తుతం బాగా ఫేమస్ అవుతోంది. ఇంతకు ఒలివియా చేసిన వెరైటీ పోస్టింగులేంటో తెలుసా? తన ప్రియుడికి నచ్చని తాను వేసుకునే డ్రెస్సులతో ఫొటోలు దిగి వాటిని #క్లాథ్స్‌మైబాయ్‌ఫ్రెండ్‌హేట్స్ పేరిట ఇన్‌స్టాగ్రామ్‌‌లో పెట్టింది. అంతే… నిమిషాల వ్యవధిలోనే ఆ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారాయి. దాంతో ఒలివియాకు ఫాలోవర్స్ కూడా పెరిగారు. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌‌ ఖాతాకు సుమారు 30 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె రాత్రికి రాత్రే బాగా పాపులర్ అయిపోయింది.

ఈ సందర్భంగా ఒలివియా మాట్లాడుతూ… నా ప్రియుడు నా హై స్ట్రీట్ కొనుగోళ్లను అసలు ఇష్టపడేవాడు కాదు. ఇంకా చెప్పాలంటే నేను వేసుకునే ఏ డ్రెస్ అతడికి నచ్చదు. దాంతో ఒకరోజు నాకు నిజంగానే నేను వేసుకునే దుస్తులు అంతా చండాలంగా ఉంటున్నాయా అనే అనుమానం వచ్చింది. అదే సమయంలో నాకు ఓ మంచి ఐడియా కూడా వచ్చింది. నేను ధరించే డ్రెస్సులపై ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నా ఫాలోవర్స్ అభిప్రాయం తెలుసుకోవాలనిపించింది. వెంటనే #క్లాథ్స్‌మైబాయ్‌ఫ్రెండ్‌హేట్స్‌ పేరిట వేర్వేరు డ్రెస్ లు వేసుకొని కొన్ని ఫొటోలు పోస్ట్ చేశాను. ఆ ఫొటోలకు మంచి స్పందన వచ్చింది. కొందరు బాగున్నాయంటే.. మరికొందరు పర్వాలేదు అన్నారు. కాని మహిళల నుంచి మాత్రం అద్భుతమైన స్పందన వచ్చింది. నీకు మంచి డ్రెస్ సెన్స్ ఉందంటూ మెచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి తాను ఇలా వేర్వేరు డ్రెస్సులు వేసుకొని ఫొటోలు పోస్ట్ చేయడం చేస్తున్నానని ఒలివియా చెప్పుకొచ్చింది. దీంతో రోజురోజుకు ఫాలోవర్స్ పెరిగి ఇప్పుడు 30వేలకు చేరారంది. ఈ వెరైటీ పోస్టింగులతో ఆమె అనతికాలంలోనే సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయింది. కాని ఇప్పటికీ తన బాయ్‌ఫ్రెండ్‌కు మాత్రం తాను వేసుకునే డ్రెస్సులు నచ్చడం లేదని ఒలివియా వాపోయింది.

Related posts