telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

నిరవ్ మోడీని అప్పగిస్తాం.. ఏ జైల్ లో పెడతారు.. : లండన్ కోర్టు

london court on nirav modi jailed

యూకే కోర్టు పంజాన్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర మోసం చేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసును జూన్ 27కి వాయిదా వేసింది. నీరవ్ మోదీని భారత్ కు అప్పగించే విషయమై లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ చేపట్టారు.

నీరవ్ మోదీని అప్పగిస్తే అతడిని ఏ జైల్లో ఉంచుతారో చెప్పాలంటూ న్యాయస్థానం భారత్ ను కోరింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి 14 రోజుల గడువు విధించింది. భారత వర్గాలు నీరవ్ మోదీని ముంబయి ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని న్యాయమూర్తితో చెప్పినట్టు తెలుస్తుంది.

Related posts