telugu navyamedia
రాజకీయ వార్తలు

అయోధ్య తీర్పుపై జయప్రకాశ్ నారాయణ ట్వీట్

Loksatha comments Janasena

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద భూమి హిందువులదేనని అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పులో పేర్కొంది. ఈ నేపథ్యంలో లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధినేత జయప్రకాశ్ నారాయణ ట్విటర్ లో స్పందించారు.

“హిందువులు కానీ, ముస్లింలు కానీ… అన్ని వర్గాల ప్రజలు అయోధ్య వివాదంలో అనవసర రాద్ధాంతానికి ముగింపు కోరుకున్నారు. ఒక స్థానిక భూవివాదం జాతీయ సమస్యగా మారిందంటే అందుకు కారణం పక్షపాత రాజకీయాలు, కొన్ని గ్రూపుల అస్థిత్వ పోరాటం. ఇక ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. మన యువత భవిష్యత్ పై దృష్టి సారిద్దాం” అంటూ ట్వీట్ చేశారు.

Related posts