telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

16 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం: కేటీఆర్‌

KTR Counter pawan comments

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనకు 16 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం లభిస్తుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇందుకోసం కార్యకర్తలు తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు మేజిక్‌ ఫిగర్‌ వచ్చే అవకాశాలేవన్నారు. సోమవారం తెలంగాణభవన్‌ లో నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మొన్నటి శాసనసభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ విజయం సామాన్య విజయం కాదన్నారు.

నల్లగొండలో ఫ్లోరోసిస్‌ సమస్యపై టీఆర్‌ఎస్‌ పోరాడితే ఆనాడు మంత్రులుగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డిలు పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో 2 లక్షల మంది జీవచ్ఛవాలుగా ఉన్నా..కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కిరణ్‌రెడ్డి సొంత జిల్లా చిత్తూరుకు 9 వేల కోట్లు తీసుకుపోతుంటే కాంగ్రెస్‌లోని తెలంగాణ మంత్రులు నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. నెలరోజుల్లో మిషన్‌ భగీరథ పూర్తయి ఇంటింటికి తాగునీరు రాబోతుందని, త్వరలోనే జిల్లాలో ఫ్లోరోసిస్‌భూతం కనుమరుగవుతుందని ఆయన స్పష్టం చేశారు.

Related posts