telugu navyamedia
రాజకీయ వార్తలు

లోక్‌సభ రద్దు చేస్తూ నేడు కేబినెట్‌ తీర్మానం!

E B C Bill Passes Lok Sabha

దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మేజిక్‌ ఫిగర్‌కు సరిపడే సీట్లు సొంతంగానే సాధించిన బీజేపీ మిత్రపక్షాలతో కలిసి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈరోజు సాయంత్రం ప్రధాని కార్యాయంలోని సౌత్‌బ్లాక్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో ప్రస్తుతం నడుస్తున్న 16వ లోక్‌ సభను రద్దుచేస్తూ తీర్మానం చేయనున్నారు. ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి జూన్‌ 3 వరకు ఉంది. రెండు రోజుల్లో ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతితో సమావేశమై లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన అభ్యర్థుల జాబితా అందజేస్తారు. అనంతరం ఆయన నూతన ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు.

Related posts