telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బెంగాల్ సీబీఐ వ్యవహారం… రసాభాసగా లోక్ సభ..

loksabha adjourned on bengal issue

పశ్చిమ బెంగాల్ లో సీబీఐ దాడుల గురించి నేడు లోక్ సభలో గందరగోళం నెలకొంది. కేంద్రప్రభుత్వం తీరుకు నిరసనగా తృణమూల్‌ ఎంపీలు ఆందోళనచేపట్టారు. సోమవారం సభ ప్రారంభం కాగానే.. టీఎంసీ ఎంపీలు కోల్‌కతా వ్యవహారాన్ని లేవనెత్తారు. ప్రశ్నోత్తరాల తర్వాత దీనిపై చర్చ చేపడదామని స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ చెప్పడంతో వారు ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టారు. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు సభ ప్రారంభం కాగానే టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాజా పరిణామాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

దీనికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ.. సీబీఐ అధికారులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని రాజ్‌నాథ్‌ అన్నారు. ‘కోల్‌కతా ఘటన దేశ రాజకీయ వ్యవస్థకు ముప్పు లాంటిది. శారదా కుంభకోణంలో బడా రాజకీయ నాయకులు ఉన్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలిందని గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. దీనిపై నేను బెంగాల్‌ గవర్నర్‌తో మాట్లాడాను. ఘటనపై నివేదిక ఇవ్వాలని కోరాం’ అని తెలిపారు. రాజ్‌నాథ్‌ ప్రసంగాన్ని తృణమూల్‌ నేతలు అడ్డుకోవడంతో సభలో మళ్లీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ సభను వాయిదా వేశారు.

Related posts