telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఇక్కడ కేటీఆర్.. అక్కడ లోకేష్, ..వారి తండ్రులు.. కేంద్రంలోనా! అందుకే రాజధాని దగ్గరగా .. పోటీకి..!!

lokesh from mangalagiri confirmed

మొదటి నుండి లోకేష్ ను ఏపీ రాజధాని అమరావతికి దగ్గరగా నే పోటీలోకి దించాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్న విషయం తెలిసిందే. దీనితో ఆయా ప్రాంతాల పేర్లు లోకేష్ పోటీ చేయవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా, మంగళగిరికి లోకేష్ పోటీ చేసే స్థానంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. మంగళగిరిలో టీడీపీ బలీయంగా ఉన్న నేపథ్యంలో లోకేశ్ పోటీచేస్తే విజయం నల్లేరుపై నడకలా మారుతుందని భావిస్తున్నారు.

ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి కాకుండా బీసీ నేతకు కేటాయించాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏకంగా నారా లోకేశ్ మంగళగిరి నుంచి పోటీకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి దిగబోతున్న నేపథ్యంలో ఆయన్ను ఓడించేందుకు దీటైన అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దింపవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం లోకేశ్ ఎమ్మెల్సీ, మంత్రిగా కొనసాగుతున్నారు.

మొత్తానికి కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కి రాష్ట్ర బాధ్యతలు ఇచ్చి, తాను కేంద్రంలో చక్రం తిప్పాలని ప్రణాళికలు వేస్తున్నాడు. ఇటు చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేష్ కు కేసీఆర్ మాదిరి విజయం అనంతరం పగ్గాలు ఇచ్చి, తాను కేంద్రం బాట పెట్టాలనే చూస్తున్నట్టుగా ఉంది. అందుకే మొదటి నుండి లోకేష్ పోటీ చేసే నియోజక వర్గం రాజధానికి దగ్గరగానే ఉండాలని బాబు స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. తాజా నిర్ణయం కూడా ఇందుకు అనుగుణంగానే తీసుకోవడం జరిగి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts