telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అఫిడవిట్ లో మంత్రి లోకేష్ మరో తప్పు.. భర్త స్థానంలో చంద్రబాబు పేరు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేష్ ఈ మధ్య వరుస తప్పులు చేస్తున్నారు. ఆయన ఏ బహిరంగ సభలో మాట్లాడినా పొరపాటున ఏదో ఒకటి తప్పు దొర్లుతుంది. మొన్న వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే పరవశించిపోయాం అంటూ కామెంట్స్ చేసి ఇరుక్కుపోయాడు. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో.. నియోజకవర్గం పేరును కూడా తప్పుగా పలికారు. అంతేకాదు ఎన్నికల తేదీని కూడా తప్పుగా చెప్పారు.

వీటన్నింటినీ పట్టుకొని ఆయనను నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా మరోసారి లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. శుక్రవారం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి లోకేష్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల అఫిడవిట్ లో మరోసారి లోకేష్ మిస్టేక్ చేశారు. భర్త పేరు అని రాసి ఉన్న చోట తన తండ్రి చంద్రబాబు పేరు రాయడం విశేషం. ఆ అఫిడవిట్ పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts