telugu navyamedia
రాజకీయ వార్తలు

ఏపీ, తమిళనాడులో బీజేపీ ఖాతా తెరవదు: మమత

BJP compliant EC West Bengal

ఈ సారి ఎన్నికల్లో ఏపీ, తమిళనాడులో బీజేపీ ఖాతా తెరవదని బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. గురువారం ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ బెంగాల్‌లో ఓట్ల కోసం బీజేపీ నేతలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేశారని ఆరోపించారు. తమ పార్టీని కార్యకర్తలను బెదిరిస్తూ, గుండాల్లా ప్రవర్తించారని దీదీ ఆరోపించారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి పరాభావం తప్పదని జోస్యం చెప్పారు. ముఖ్యంగా దక్షిణాదిన దారుణమైన ఫలితాలను చవిచూస్తుందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో కనీసం ఖాతా కూడా తెరవదని పేర్కొన్నారు. మహారాష్ట్రలో 20, దేశ వ్యాప్తంగా 200 స్థానాలను కొల్పోతుందని తన సర్వే ఫలితాలను మమత వెల్లడించారు.పశ్చిమ బెంగాల్‌లోని 9 నియోజకవర్గాలకు ఆదివారం చివరి విడత పోలింగ్‌ జరగనుంది. ఏడో విడత ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రానికి ముగియాల్సి ఉండగా, హింసాత్మక ఘటనల నేపథ్యంలో బెంగాల్‌లో మాత్రం గురువారం రాత్రి ముగించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts