telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మద్యం దొరక్క ఆందోళన.. కార్మికుడి ఆత్మహత్య

liquor shops ap

కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో నిత్యావసరాలు, వైద్య, అత్యవసర సదుపాయాలు మినహా అన్ని దుకాణాలను మూసివేశారు. దీనివల్ల సామాన్యుల సంగతేమో గానీ మద్యానికి బానిసలైన వారి పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. మద్యం లేకపోవడంతో వాళ్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. మద్యం లభించడం లేదని హైదరాబాద్‌లో ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకోగా.. మరోవ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

పోలీసుల కథనం ప్రకారం బంజారాహిల్స్ ఇందిరానగర్లో ఉంటూ సినీ పరిశ్రమలో పెయింటర్ గా పని చేస్తున్న మధుకి (55) రోజూ మద్యం సేవించే అలవాటు ఉంది. అయితే, కొన్ని రోజులుగా వైన్‌ షాపులు మూసేయడంతో అతనికి మద్యం దొరకలేదు. దాంతో గురువారం రాత్రి బంజారాహిల్స్ పదో నంబర్ రోడ్డులో ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్వార్టర్స్‌లోని ఎనిమిదో బ్లాక్‌ భవనంలోని నాలుగో అంతస్థు నుంచి కిందకు దూకి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Related posts