telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సీఎం జగన్ కీల‌క నిర్ణ‌యం.. క‌ర్ఫ్యూలో మ‌రిన్ని స‌డ‌లింపులు

కోవిడ్‌పై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కర్ఫ్యూ వేళల సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు సిఎం జగన్. ఏపీ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు వర్తించనున్నాయి. జూన్‌ 20 తర్వాత నుంచి అమలు ఈ సడలింపు వర్తించనున్నాయి. సర్కార్ నిబంధనల ప్రకారం.. సా.5 గంటలు కల్లా దుకాణాలు మూసివేయాలి. సా. 6 గంటల నుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమలు చేయనుంది సర్కార్. తూ.గో. జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సడలింపులు ఇస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు సడలింపులు ఇవ్వనుంది. ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్‌ టైమింగ్స్‌ ఉండనుండగా.. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా సర్కార్ చర్యలు తీసుకుంటోంది. కాగా ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గు ముఖ్యం పడుతున్న సంగతి తెలిసిందే. 

Related posts