telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ జిల్లాలో లాక్‌డౌన్‌… కానీ..?

lockdown corona

దేశంలోని అన్ని రాష్ట్రాలు క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్నారు.  అయిన‌ప్ప‌టీ క‌రోనా కేసులు కంట్రోల్ కావ‌డంలేదు. క‌రోనా మ‌హ‌మ్మారిని అదుపు చేయ‌డానికి లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గంగా క‌నిపిస్తోంది. అందుకే చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నాయి.  ఇక క‌ర్ణాట‌క‌లో ప‌రిస్థితి మ‌రింత ఘోరంగా మారింది.  రోజువారీ కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క‌లోని హాస‌న్ జిల్లాలో లాక్‌డౌన్‌ను విధించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  జిల్లాలోని ఎమ్మెల్యేల‌తో చ‌ర్చించిన త‌రువాత లాక్‌డౌన్‌పై నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పేర్కోన్నారు.  వారంలో నాలుగు రోజుల‌పాటు  సంపూర్ణ లాక్‌డౌన్ ను, మూడు రోజుల‌పాటు సాధార‌ణ జీవ‌నం ఉద‌యం 6 నుంచి 10గంట‌ల వ‌ర‌కు నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

Related posts