telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేరళ : .. పెరుగుతున్న … దేశీయ పర్యాటకులు..

local tourism came to normal in kerala

హెల్త్ ఎమర్జెన్సీ నుండి కోలుకున్న తరువాత కేరళకు దేశీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత త్రైమాసికంలో 16 శాతం వృద్ధిరేటు నమోదైందని పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కేరళ టూరిజం పార్ట్‌నర్‌షిప్‌ మీట్‌ 2020 కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సతృపదత్‌, కేరళ పర్యాటకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మురళీధరన్‌ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.

దేశీయ పర్యాటకులతోపాటు విదేశీ పర్యాటకులు కూడా పెరిగారని అన్నారు. ప్రకృతి వైపరిత్యాలు ఎదుర్కొని కేరళ పర్యాటకం నిలబడిందన్నారు. తెలంగాణ ప్రాంతము నుండి కేరళ పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి ఎక్కువ మొత్తంలో వస్తున్నారని, పర్యాటకులను ఆకర్షించే ఎన్నో అందాలు కేరళ స్వంతమని అన్నారు. అందుకే కేరళను పర్యాటకుల స్వర్గధామని పిలుస్తారని అన్నారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే విషయంలో కేరళ రాష్ట్రం ముందు వరుసలో ఉందని అన్నారు.

Related posts