telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ హీరో ఆస్తులు వేలానికి… 5 కోట్ల అప్పు

Vijay-Kanth

నటుడు విజయ్ కాంత్ ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొంది ఎందరికో అభిమాన హీరోగా నిలిచారు. తెలుగులో కూడా ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. తాజాగా విజయ్ కాంత్ ఆస్తులను ఓ జాతీయ బ్యాంక్ వేలం వేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. రూ.5 కోట్ల అప్పు కట్టకపోవడంతో ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఆ కథనాల సారాంశం. వివరాల్లోకి వెళ్తే… “ఆండాళ్ అళగర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్” పేరుతో విజయ్ కాంత్ ఓ సంస్థను నడిపిస్తున్నారు. దీనిపేరు మీద ఐదు కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. అయితే డబ్బు సకాలంలో తిరిగి చెల్లించలేకపోవడంతో ఆయనకి సంబంధించిన ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించారు. ఆస్తుల వేలానికి పర్మిషన్ ఇస్తూ విజయ్ కాంత్, అతడి భార్య ప్రేమలతా సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ వేలం ప్రకటన చూసిన అభిమానులు కొందరు విజయ్ ఆస్తులను దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక సినిమాల తరువాత విజయ్ కాంత్ “డిఎండికె” అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఇటీవల జరిగిన తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో డిఎండికే పార్టీ తరఫున పలువురు అభ్యర్ధులు బరిలో నిలవగా ఘోరంగా ఓడిపోయారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. ఇప్పుడు ఆస్తులు కూడా వేలానికి వేయడం అనేది ఆయన అభిమానులను ఆందోళన పరిచే విషయం.

Related posts