• Home
  • Trending Today
  • ఎల్.కే.అద్వానీకి చైర్మన్ గా పగ్గాలు…
Trending Today రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

ఎల్.కే.అద్వానీకి చైర్మన్ గా పగ్గాలు…

lk advani as ethics committee chairmen

బీజేపీ పార్టీలో కురువృద్ధుడు, సీనియర్ నాయకుడు ఎల్.కే.అద్వానీ ని గౌరవించడం మొదలుపెట్టినట్టుంది ఆ పార్టీ అధిష్టానం. దేశంలో వ్యతిరేకత వారిని ఇలా వంచేసిందా.. అన్నట్టు వినయంగా ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా ఎల్.కే.అద్వానీ ని నియమించారు. దీనికి లోక్ సభ స్పీకర్ ఆమోదం తెలిపారు. ఇక నుండి లోక్ సభ సభ్యులు అనైతికంగా ఏమైనా ప్రవర్తించారంటే వారిపై పిర్యాదులు ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఇందులో కొన్ని సుమోటోగా కూడా స్వీకరిస్తుంది.

అద్వానీని ఎంపిక చేసినట్టు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బులిటెన్ విడుదల చేశారు. ఇదే కోవలో మరికొన్ని కమిటీలకు చైర్మన్ లను నియమించే పనిలో ఆమె ఉన్నారు. ఇక సభలకు గైర్హాజరు కమిటీకి చైర్మన్ గా పి.కరుణాకరన్ ను రెండవ సారి నియమించారు. ప్రభుత్వ హామీ కమిటీ చైర్మన్ గా రమేష్ ప్రోక్రియాల్ నిశాంక్, పేపర్స్ లే యాడ్ ఆన్ టేబుల్ కమిటీ చైర్మన్ గా చంద్రకాంత్, లెజిస్లేషన్ సబార్డినేట్ కమిటీకి చైర్మన్ గా దిలీప్ కుమార్ మన్సుఖ్ లాల్ గాంధీ లను నియమించారు.

Related posts

యూపీలో ఘోర రైలు ప్రమాదం..ఆరుగురు దుర్మరణం

madhu

‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ అంటే ఇదే…!

admin

విజ‌య‌దేవ‌ర్‌కొండలో ఒరిజినాలిటీ ఉంది-  ‘స‌ద‌ర‌న్ స్టార్‌’ అల్లు అర్జున్‌…

chandra sekkhar

Leave a Comment