telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జస్టిన్ బిబర్ పాపులర్ సాంగ్ రైతు నోట… నెటిజన్లు ఫిదా

Baby

పాప్‌స్టార్ జస్టిన్ బిబర్ “బేబి” ఆల్బమ్ ఎంతో ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జస్టిన్ పాడిన ఈ పాట ఇంటర్‌నెట్‌ను షేక్ చేసింది. ఇంగ్లీష్‌లో సాగే ఇదే పాటను కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ యువ రైతు పాడి అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. “డు యు నో యు లవ్ మీ” అంటూ బేబి సాంగ్ ను రైతు జస్టిస్ బిబర్ స్టైల్ లో పాడిన ఈ పాటను ఎంఎస్ ఇసాయ్‌పల్లి యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. ఒరిజినల్ లిరిక్స్ ఏ మాత్రం తప్పుపోకుండా యువరైతు పాడిన ఈ పాటకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోకు తక్కువ సమయంలోనే లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి. ఇండియా జస్టిన్ బిబర్‌లా పాడిన ఈ పాట ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తుంది. అయితే పాటతో వైరల్ అవుతున్న ఆ యువరైతు పేరేంటో తెలియాల్సి ఉంది.

Related posts