telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోహీరోయిన్స్‌ గురించి రాశారే తప్ప… మాస్కోలో తాగిన మత్తులో ఆ రాత్రి… : పూరి

Puri

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’లో తాజాగా “విజయ చిత్ర” అనే సినీ మాసపత్రిక గురించి మాట్లాడారు. “రామారావుగారు, నాగేశ్వరావుగారు, కృష్ణగారు, కృష్ణంరాజుగారు, కాంతారావుగారు, ఎస్‌.వి.రంగారవు, రాజబాబు, రేలంగి, రమాప్రభ, పద్మనాభం, రాజనాల, ఎల్‌.వి.ప్రసాద్‌, చక్రపాణి, ఘంటశాల, అంజలీదేవి, జమున, దేవిక, ఎస్‌.విజయలక్ష్మి, జయలలిత, .. ఇలా ఎంతో మంది ఇంటర్వ్యూలను చదివాను. అందరి గురించి చదువుతుంటే వారిపై రెస్పెక్ట్‌ పెరిగింది. సినిమా నిర్మాణంలో సాధక బాధకాలుండేవి అందులో. ఏ కెమెరా ఎక్కడ నుండి తెచ్చారు. నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యింది అనే విషయాలుండేవి. అవి చదువుతుంటే పాండిబజార్‌ వెళ్లి అక్కడ తిరిగితే చాలు అనుకున్నాను. వారిపై అంత గౌరవం పెరగడానికి కారణం.. సావిత్రిగారి అభిరుచులు గురించి రాశారు కానీ.. ఎఫైర్స్‌ గురించి రాయలేదు. రష్యాలో మన తెలుగు సినిమా ప్రదర్శనకు వెళ్లిన మన హీరో హీరోయిన్స్‌ గురించి రాశారే తప్ప… మాస్కోలో తాగిన మత్తులో ఆ రాత్రి ఏం జరిగిందని రాయలేదు. చెడు రాయలేకకాదు. రాయడం ఇష్టం లేక. దాని వల్ల నాకు సినిమా అంటే విపరీతమైన గౌరవం పెరిగిపోయింది” అంటూ విజయచిత్ర మేగజైన్‌ గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు పూరి.

Related posts