telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లైఫ్ లో అన్నీ కొంచమే చేయండి : పూరి జగన్నాథ్

Puri

డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్ తాజాగా తన మ్యూజింగ్స్‌లో ‘లిటిల్‌’ అనే టాపిక్‌ ప్రస్తావించారు. “లైఫ్‌లో ఏం చేసినా కొంచమే చేస్తే మంచిది. ఎక్కువ చేయవద్దు. కొంచం తినండి. కొంచం తాగండి. విపరీతంగా తాగవద్దు. అదే పనిగా పేకాట ఆడవద్దు. కాసేపు ఆడుకోండి. కాసేపు పని చేయండి. కాసేపు ఎక్సర్‌సైజులు చేయండి. అన్నీ కొంచం కొంచం చేస్తే చాలు. కొంచం నవ్వండి. కొంచం ఆడండి. కొంచమే ప్రేమించండి. కొంచమే ఏడవండి. కొంచం చదువుకోండి. కొంచం నేర్చుకోండి. మంచి కావచ్చు, చెడు కావచ్చు, వ్యసనాలు కావచ్చు. ఎనీథింగ్‌.. ఏదైనా కొంచంతో సరిపెట్టుకోండి. ఓవరాక్షన్ చేయవద్దు. షేర్లు కూడా కొంచమే కొనండి. మొత్తం తీసుకెళ్లి అందులో పెట్టవద్దు. ఎక్కువ దానధర్మాలు కూడా ఓవరాక్షనే. ఎక్కువ పార్టీలు కూడా ఓవరాక్షనే. ఎక్కువ మంచితనం, ఎక్కువ దుర్మార్గం.. ఎనీథింగ్‌ టు మచ్‌ ఈజ్‌.. తప్పున్నర తప్పు. లైఫ్‌లో అన్నీ కొంచం కొంచం చేస్తే.. అది అందరికీ మంచిది. ఒకవేళ చిన్న చిన్న తప్పులు జరిగినా సరిదిద్దుకోవడానికి ఉంటది. కోపం వస్తే కొంచెం కొట్టండి. రెండు తగిలించండి. అంతేకానీ మర్డర్‌ చేయవద్దు. దేవుడికి దణ్ణం పెట్టుకోండి తప్పులేదు.. యజ్ఞాలు, యాగాలు చేయవద్దు. దేశాన్ని దొబ్బేద్దాం అనుకునే వాళ్లు చేసే పనులవి. ఇవన్నీ ఓవరాక్షన్ కిందే వస్తాయి. కొంచం నీరు, కొంచం నిప్పు..అంతే..” అంటూ చెప్పుకొచ్చారు పూరి జగన్నాధ్‌.

 

View this post on Instagram

 

‪👉 https://youtu.be/r0Iecdl4tOQ @charmmekaur #PC

A post shared by Puri Connects (@puriconnects) on

Related posts